23 April, 2026 | 4:44 PM

పాలేరు జలాశయం వద్ద వ్యక్తి బలవన్మరణం

23-04-2026 03:13 PM

సూర్యాపేట జిల్లా వాసిగా గుర్తింపు

కూసుమంచి, ఏప్రిల్ 23(విజయక్రాంతి): కూసుమంచి మండలం పాలేరు జలాశయం ఫాలింగ్ గేట్ల వద్ద సూర్యాపేట జిల్లా మోతి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా (45)  అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేపచెట్టుకు తాడుతో ఉరి బిగించుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం చేపల పెట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నేలకొండపల్లి మార్చరీకి తరలించారు.