4 September, 2026 | 3:06 PM

మల్లారెడ్డి యూటర్న్

04-09-2026 | 06:05am
  1. హరీష్‌రావు ఆధ్వర్యంలో చర్చలు 
  2. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం 
  3. పార్టీ మారడంపై అనుచరుల నుంచి వ్యతిరేకత
  4. బీఆర్‌ఎస్‌లో యాక్టివ్ మోడ్‌లోకి మల్లారెడ్డి 

మేడ్చల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Chamakura Malla Reddy) పార్టీ మారడంపై యూటర్న్(U-turn) తీసుకున్నట్లు తెలిసింది. బిజెపిలోకి వెళ్లాలని భావించినప్పటికీ మనసు మార్చుకుని బిఆర్‌ఎస్‌(BRS)లోనే కొనసాగాలని నిర్ణయించుకున్న ట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆధ్వర్యంలో జరిగిన చర్చల నేపథ్యంలో మల్లారెడ్డి బిఆర్‌ఎస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవల కాలంలో మల్లా రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉన్నారు. ఆయన మాట తీరు, వ్యవహార శైలి కూడా పార్టీ మారుతున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. ఉమ్మడి జిల్లాలో జరిగిన కేటీఆర్(KTR) సమావేశానికి డుమ్మా కొట్టి ఘట్కేసర్ లో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సభకు హాజరయ్యారు. ఆ సభలో కెసిఆర్(KCR) పై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమ యంలో మల్లారెడ్డి వేదికపై మౌనంగా ఉన్నారు.

వేదిక దిగిన తర్వాత కానీ, మరుసటి రోజు కానీ ముఖ్యమంత్రి విమర్శలను ఖండించలేదు. మల్లారెడ్డి వ్యవహా రంపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా(BRS Social Media)లో మల్లారెడ్డికి వ్యతిరేకం గా పోస్టులు పెట్టా రు. ఒక సందర్భంలో స్వయంగా మల్లారెడ్డే పార్టీ మారుతున్నానని తనను కార్యకర్తలు మరచిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని స్పష్టమైంది. 

అనుచరుల్లో వ్యతిరేకత..

మల్లారెడ్డి పార్టీ మారాలనే నిర్ణయంపై అనుచరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. మేడ్చల్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీలో ఉ ద్యమకారులు ఎక్కువగా ఉ న్నారు. మల్లారెడ్డి టీడీపీ తరఫున ఎంపీగా గెలిచి బిఆర్ ఎస్‌లోకి వచ్చారు. స్థానిక నాయకులు మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొని పార్టీలోనే కొనసాగుతున్నారు. తర్వాత మల్లారెడ్డి కి కనెక్ట్ అయ్యారు. పార్టీ మారడంపై నిర్మొహమాటంగా తమ అభిప్రా యాలను చెప్పారు.

మేమైతే బి.ఆర్.ఎస్ వీడబోమని స్ప ష్టం చేసినట్లు తెలిసింది. ముఖ్య అ నుచరులు, సమీ ప బంధువులు సైతం మల్లారెడ్డి పార్టీ మారడాన్ని వ్యతిరేకించారు. పార్టీలో మల్లారెడ్డి పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అ యింది. ఒక కార్యకర్త రక్తంతో లేఖ రాశాడు. పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించాడు. మరోపక్క మల్లారెడ్డి చేరాలనుకున్న బిజెపి అధిష్టానం సైతం షరతులు పెట్టినట్లు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించింది.

అంతేగాక కోడలు ప్రీతి రెడ్డిని బిజెపి తరఫున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నాయ కుడు, బీసీ ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను పక్కనబెట్టి ప్రీతి రెడ్డికి టికెట్ ఇవ్వడం అంత సులభమైనది కాదు. ఇవన్నీ ఆలోచించి మల్లారెడ్డి పునరాలోచించినట్లు తెలిసింది. 

హరీష్ రావు ఆధ్వర్యంలో చర్చలు..

బీఆర్‌ఎస్ అగ్ర నాయకుడు, మాజీమంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఇద్దరి మ ధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. మల్లారెడ్డి హరీష్ రావు దగ్గరికి వెళ్ళాడా, బిఆర్‌ఎస్ అధిష్టానం చొరవ తీసుకొని చర్చలు జరిపింద అనే విషయంలో స్పష్టత లేదు. కానీ చర్చలు మాత్రం జరిగాయి. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. చర్చలు విజయవంతమయ్యా యి. మల్లారెడ్డికి, పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయింది. 

యాక్టివ్ మోడ్‌లోకి మల్లారెడ్డి..

బీఆర్‌ఎస్‌లో మల్లారెడ్డి మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై నిరసనలు తెలపాలని బీఆర్‌ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో చురుగ్గా పా ల్గొంటున్నారు. మొదటి రోజు రెండు చోట్ల పాల్గొన్నారు. మేడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో డ్యాన్స్ చేసి శ్రేణులను ఉత్సాహ పరిచారు. రెండవ రోజు ఘట్కేసర్ మం డలం ఎదులాబాదులో జరిగిన కార్యక్రమం లో ఏకంగా ఒక వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకున్నారు. జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. మల్లారెడ్డి యాక్టివ్ కావడం బీఆర్‌ఏ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.