దోమల వ్యాప్తిని అరికట్టడంతో మలేరియాను జయించవచ్చు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా "మలేరియాను అంతం చేయడానికి పట్టుదలతో,ఇప్పుడు మనం చేయగలం.ఇప్పుడు మనం తప్పనిసరిగా చేయాలి"అనే అంశంతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్ తెలిపారు. దోమల వ్యాప్తిని అరికట్టడంతో మలేరియా వ్యాధిని జయించవచ్చునని డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు.
అలాగే చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని దోమలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో వడదెబ్బ నివారణపై కూడా అవగాహన కల్పించారు. తగినంత నీరు తాగడం నిమ్మరసం, ఓఆర్ఎస్,మజ్జిగ తీసుకోవాలని, లేత రంగు పత్తి దుస్తులు ధరించడం గొడుగు టోపీ వినియోగించడం, మధ్యాహ్నంవేళ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని,చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు,గుండె జబ్బులు అధిక రక్తపోటు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ సుజన్ కుమార్ తెలిపారు.మండలంలోని వివిధ గ్రామాల్లో మలేరియా పై ఆరోగ్య వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.






