18 March, 2026 | 2:34 AM

దళిత మహాసభను విజయవంతం చేయండి

18-03-2026 01:00 AM

కొత్తపల్లి, మార్చి17 (విజయ క్రాంతి): మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా  ఈనెల 18 న ఉ మ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో జరిగే దళిత మ హాసభను విజయవంతం చే యాలని ఎంహెచ్ పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీనివాస్  పిలుపునిచ్చా రు. మంగళవారం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభ కరపత్రాలు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ  రాష్ట్రంలో ఎస్సీ లకు 20శాతం రిజర్వేషన్ పెంచి జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ను మూడు భాగాలుగా విభజించి తక్షణమే చైర్మన్ లను నియమించాలన్నారు.అంబేడ్కర్ అభయహస్తం పేరిట దళితులకు 12లక్షల ఆర్థికసాయం ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18న నిర్వహించే ఆవిర్భావ సభకు జిల్లాలోని మాదిగలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనకం నాగరాజు, లక్ష్మణ్, ఆర్ సదానందం, కనకం ఓదయ్య,  కొoకటి శ్రీనివాసు, రాజు, తదితరులు పాల్గొన్నారు.