8 August, 2026 | 6:58 PM

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08-08-2026 05:35 PM

20 మంది ప్రయాణికులు సురక్షితo.

భూపాలపల్లి.(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రం సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి రహదారి ప్రక్కనున్న అడవిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.