8 August, 2026 | 7:13 PM

పరమేశ్వర్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత

08-08-2026 05:39 PM

 రూ.60 వేల ఆర్థిక సాయం

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన పల్లె పరమేశ్వర్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి నలందా హైస్కూల్ ఎస్‌ఎస్‌సీ 1999 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. పరమేశ్వర్ సతీమణి  పల్లె శ్రీలతతో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రులు మానవత్వంతో ముందుకు వచ్చి రూ.60 వేలను కుటుంబానికి శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీలత బ్యాచ్‌మేట్స్ కార్తీక్, సద్గుణ, రాజు, ఎల్లయ్య, సంపత్, ప్రభాకర్, సారంగం, , మల్లికార్జున్, రాజేష్, రాజమల్లయ్య, సదానందం తదితరులు కలిసి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని శ్రీలతకు అందజేశారు. భర్తను కోల్పోయిన శ్రీలతకు, ఆమె కుమారుడు, కుమార్తెకు అండగా నిలిచేందుకు ఈ సహాయం అందించినట్లు వారు తెలిపారు. కష్టకాలంలో తమ బ్యాచ్‌మేట్ కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థుల సేవా భావాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీలత వారికి కృతజ్ఞతలు తెలిపారు.