26 March, 2026 | 3:27 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

26-03-2026 12:48 AM

అలంపూర్ మార్చి 25: రబీ సీజన్ లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటలను సాగు చేశారని కాబట్టి ప్రభుత్వం ముందస్తుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని బీసీ సంఘ నాయకులు సింగవరం -1 గ్రామ సర్పంచ్ గొంగళ్ళ ఈశ్వర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అలంపూర్, ఉండవల్లి రాజోళి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి, వడ్డేపల్లి తదితర మండలాల్లో రబీ సీజన్లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నట్లు  తెలిపారు.

ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పం టలు అధిక వర్షాల కారణంగా పూర్తిగా దె బ్బతిన్నాయని వాటిని తీసేసి ఈ రబీ సీజన్ లో రైతులు  ఎక్కువగా మొక్కజొన్న పంట ను  సాగు చేసినట్లు  తెలిపారు.రైతులు పం డిన పంట దళారుల చేతిలో మోస పోకుం డా ముందస్తుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.