13 June, 2026 | 11:31 PM

మీనాక్షి నటరాజన్ కు.. కేసుకు అసలు సంబంధమే లేదు

13-06-2026 04:13 PM

మనది ప్రజాస్వామ్య దేశమా? నియంత దేశమా?

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) విషయంలో బీజేపీ తీరు అప్రజాస్వామికమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మనది ప్రజాస్వామ్య దేశమా? నియంత దేశమా? అని మహేష్ గౌడ్  ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ కు కేసులకు అసలు సంబంధమే లేదని మహేశ్ గౌడ్ సూచించారు. మీనాక్షి నటరాజన్ పైఎఫ్ఐఆర్, కేసు లేదు.. నోటీసు మాత్రమే వచ్చిందని తెలిపారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ కుట్ర చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఓటు చోరీతో పాటు ఇప్పుడు సీటు చోరీ చేసిందని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు.