23 August, 2026 | 2:35 PM

80 శాతం వాళ్లకే! నామినేటెడ్ పదవులపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన

23-08-2026 01:15 PM

సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ

80 శాతం పదవులు పాత కార్యకర్తలకే

వచ్చే ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో అధికారంలోకి వస్తాం

నిజామాబాద్: తెలంగాణలో రానున్నపై టీ కాంగ్రెస్ నేతలు(Telangana Congress leaders) ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) జిల్లాల్లో వరసగా పర్యటిస్తూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు సమావేశం అయ్యారు. సెప్టెంబర్ లో నామినేట్ పదవుల భర్తీ ఉంటుందని మహేశ్ గౌడ్ వెల్లడించారు.

80 శాతం పదవులు పాత కార్యకర్తలకే దక్కుతాయని పేర్కొన్నారు. 20 శాతం పదవులు కొత్త నేతలకు ఇస్తామని ప్రకటించారు. పార్టీకి కొత్త రక్తం కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పదవుల భర్తీలో గతంలో కొన్ని తప్పిదాలు జరిగాయని వెల్లడించారు. ఇప్పుడు నిబద్ధత గత కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో అధికారంలోకి వస్తామని మహేశ్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రకటించారు.