4 July, 2026 | 2:42 PM

సీఎం రేవంత్ రెడ్డికి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన శుభాకాంక్షలు

04-07-2026 01:26 PM

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన( CM Revanth Reddy Political Journey) శుభాకాంక్షలు తెలిపారు. మిడ్జిల్ జడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు నేటితో 20 ఏళ్ల విజయవంతమైన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి అభినందించారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో విజయవంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ZPTC సభ్యునిగా బాధ్యతలు చేపట్టడం నుండి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదిగే వరకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంపై ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.