calender_icon.png 24 February, 2026 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధు పార్క్ రిడ్జ్ వాసుల ఘోష

24-02-2026 12:04:05 AM

450 కుటుంబాల భవిష్యత్తు అంధకారం 

150 అడుగుల గాంధీ విగ్రహం కోసం అపార్ట్‌మెంట్లు కూలుస్తారా?

  1. బాధితుల ఆవేదన
  2. చట్ట ప్రకారమే పరిహారం: ఆర్డీవో

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు బాధితుల ఆందోళనలతో వేడెక్కుతోంది. బాపు ఘాట్ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ కోసం భూసేకరణ ప్రక్రియ ను ప్రభుత్వం వేగవంతం చేయడంతో, వేలా ది మంది నివాసితులు రోడ్డెక్కుతున్నారు.

సుందరీకరణ పేరుతో తమ జీవితకాల కష్టా న్ని బుల్డోజర్ల పాలు చేస్తారా అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ వాసులకు అధికారులు నోటీసులు జారీ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సీ, మూసీ నదుల సంగమ క్షేత్రమైన బాపు ఘాట్ వద్ద దేశంలోనే అత్యంత ఎత్తున 150 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు సుమారు 9.2 కిలోమీటర్ల మేర అభివద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 50 ఎకరాల ప్రైవేట్ స్థలంతో పాటు, 100 ఎకరాల రక్షణ శాఖ భూమిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల చివరలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో శంకుస్థాపన చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

భూసేకరణలో భాగంగా టిప్పు ఖాన్ ఫూల్ వద్ద ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో బాధితులు భారీ నిరసన చేపట్టారు. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, సీనియర్ జర్నలిస్టులు సుమారు 450 కుటుంబాలు గత 15 ఏళ్లుగా నివసిస్తున్నాయి. ఇది ఒక మినీ ఇండియాను తలపి స్తున్నది. ‘మేము రిటైర్మెంట్ డబ్బులతో, లోన్లు తీసుకుని కష్టపడి ఈ ఇళ్లను కొనుక్కున్నాం.

ఇప్పుడు గాంధీ విగ్రహం కోసం మా గూడును చిదిమేస్తారా’ అని నివాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రూ.5 వేల కోట్లు పెట్టి విగ్రహాలు కట్టడం కంటే, ఆ డ బ్బుతో ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అం దించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మూ సీ నదిని ప్రక్షాళన చేయడాన్ని స్వాగతిస్తామ ని, కానీ ఆ పేరుతో జనారణ్యంలో ఉన్న నివాసాలను తొలగించడం ఏమాత్రం స మంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

60 రోజుల గడువు: ఆర్డీవో

ఈ వివాదంపై రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి స్పందించారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టప్రకారమే జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 11న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజల అభ్యంతరాల కోసం 60 రోజుల సమయం ఉంద ని వెల్లడించారు. త్వరలో సర్వే జరి పి, నష్టపరిహారం అందజేస్తామన్నా రు. ఎవరికీ అన్యాయం జరగదు అని భరోసా ఇచ్చారు.

బాధితులు మాత్రం టీడీఆర్  గానీ, నగదు పరిహారం గానీ తమకు వద్దని.. తమ ఇళ్లను తమకే వదిలేయాలని డి మాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు శంకుస్థాపనకు సిద్ధమవుతుం టే, మరోవైపు బాధితులు బుల్డోజర్లను అడ్డుకుంటామని హెచ్చరిస్తుం డటంతో మూసీ పరివాహక ప్రాం తంలో పరిస్థితి ఉత్కంఠగా మారింది.