ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేదుకు యంత్రాంగాం సిద్దంగా వుండాలి: కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్( విజయక్రాంతి): వచ్చే వర్ష కాలంలో వరదలు విపత్తుల వల్లా ఆస్తులు ప్రాణ నష్టము జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు శుక్రవారం సమీకృత కల్లెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాతీయా విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు న్యూ డిల్లీ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఎం డెవిడ్ కాగజ్ నగర్ డివిజన్ అటవీ అధికారి అప్పయ్య తో కలిసి కలెక్టర్ హాజరైయ్యారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమతంగా వుండాలన్నారు. భారి అతి భారి వర్షాలు కురిసే సమయంలో వరదలు వచ్చి జన వననం స్తంభించి పోతుందని ఆ సమయంలో ప్రజలను రక్షించి వారికి పునర వాసo ఏర్పాటు చేపట్టాలన్నారు. జిల్లాలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
వరదలు వచ్చే సమయంలో ప్రజను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి రేస్కు బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరవాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారం త్రాగునీరు వైద్య చికిత్సలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, అగ్నిమాపక, నీటిపారుదల శాఖ, అధికారులు పాల్గొన్నారు.






