13 March, 2026 | 9:17 PM

ఈ నెల 28న లోక్ అదాలత్: ఎస్ఐ రవి గౌడ్

13-03-2026 06:35 PM

కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్/సిర్గాపూర్ మండల ప్రజలకు ఎస్ఐ రవి గౌడ్ ముందస్తు విజ్ఞప్తి. ఈ నెల 28 తారీఖున నారాయణ్ ఖేడ్ అందరు సద్వినియోగించుకోవాలి ప్రజలకు తెలియజేయునది ఏమనగా... ఈ నెల 28వ తారీఖున జెఎఫ్సీఎం నారాయణ్ ఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ ఉంది కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్) రాజీ చేసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి రాజీ చేసుకునే ఇరు వర్గాలు వారు ఈ నెల 13-28 వరకు సమీప పోలీస్ స్టేషన్‌, కోర్టుకు గానీ హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది

రాజి కుదుర్చుకునే వారు యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, చిట్ఫండ్ కేసులు, భూతగాదాలుకు సంబంధించిన కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు మొదలైనవి, అక్రమ రవాణా (ఇసుక, మట్టి, కట్టెలు, మద్యం మరియు ఇతరములు), పేకాట కేసులు, డ్రంకెన్డ్ డ్రైవ్ కేసులు లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు, దీని కోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులను తీసుకుని పోలీస్ స్టేషన్‌, కోర్టుకి గానీ రావాల్సిందిగా ఎస్ఐ రవి గౌడ్ సూచించారు.