17 July, 2026 | 1:44 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

గ్రంథాలయాలు విజ్ఞాన భాండారాలు

22-11-2025 12:00 AM

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య

కామారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కిష్టయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని, మేధావులు శాస్త్రవేత్తలు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉన్నాయని నేడు ఆధునికంగా వచ్చిన డిజిటల్ లైబ్రరీలు ద్వారా ప్రపంచం మొత్తాన్ని చదవచ్చని అన్నారు, 

కళాశాల గ్రంథపాలకులు డాక్టర్.దినకర్ చిన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు, కళాశాలలో వారం పాటు పుస్తక ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధిపతులు, సమన్వయకర్తలు డాక్టర్. విశ్వప్రసాద్, అంకం జయప్రకాష్, ఏవో  జగన్మోహన్,డాక్టర్ జి. శ్రీనివాసరావు, గ్రంథాలయ సహాయకులు మారుతి, రాములు, మానస, శ్రీవల్లి, రాజశ్రీ, శారద, రాజేందర్, డాక్టర్. రాజగంభీర్ రావు,స్వాతి , వెన్నెల, బాలాజీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.