కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందు ఉంచుదాం
5k రన్ కార్యక్రమం మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి
కామారెడ్డి, మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ అభివృద్ధిని చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దు దామని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 5k రన్ ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఇందిరా గాంధీ స్టేడియం వరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ , మున్సిపల్ ప్రత్యేక అధికారి, అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ ,మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి 5k రన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న 99 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని అందరూ సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని, పట్టణాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ప్రణాళిక రూపందించుకొని కామారెడ్డి పట్టణాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శవంతంగా ముందుంచుదామని అన్నారు.
5k రన్ లో పాల్గొన్న కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందికి,పట్టణ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అనంతరం ఇందిరా గాంధీ స్టేడియం లో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు,మెడల్స్ అందించి ప్రోత్సహిం చారు.




