ప్రభుత్వ విద్యా పరిరక్షణకు పోరాడుదాం
చలో హైదరాబాద్ ర్యాలీ ధర్నాను విజయవంతం చేద్దాం
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రఘు శంకర్ రెడ్డి పిలుపు
రాజన్న సిరిసిల్ల 28 మే (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అపసవ్య విధానాల వలన తెలంగాణ రా ష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం రోజురోజుకు నిర్వీర్యమై, సంక్షోభం లోకి నెట్టబడుతున్నదని, మరోవైపు విద్యా ప్రైవేటీకరణ, కార్పొ రేట్కీకరణ విధానాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్య ఉనికిని, భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5 2026 రోజున హైదరాబాదులో ర్యాలీ ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రవిశంకర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ(TSEC) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు డి రామనాథ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక గీతానగర్ జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన తె లంగాణ విద్యాపరక్షణ కమిటీ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రఘుశంకర్ రెడ్డి ప్ర సంగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని ,పాఠశాలలు, మౌ లిక భౌతిక వసతులు మెరుగుపరచాలని, అలాగే విద్యను కేంద్రీకరించే విధంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠ శాలల నిర్మాణాలను నిలిపివేయాలని, ప్రస్తుత గురుకులాలు ఉన్న ప్రాంతాలలోనే నిర్వహించాలని,అలాగే తెలంగాణ విద్యా క మిషన్ సిఫారసు మేరకు నిర్మించాలనుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కూడా మానుకోవాలని, ప్రస్తుత ఉన్న పాఠశాలల్లోనే సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే జాతీయ విద్య విధానం 2020 అమలను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ,పౌర సమాజం అందరూ కలిసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, పరిరక్షించుకోవాలని బాధ్యతగా ముందుకు రావాలని బుద్ధి జీవులు, విద్యావేత్తలు ఆలోచించాలని రఘుశంకర్ రెడ్డి పిలుపునిచ్చారు, అనంతరం ధర్నా కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ విద్యాపరి రక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి జిల్లా ,గౌరవ అధ్యక్షులు ఏ రాజేశ్వరరావు, టీపీటీఎఫ్‌జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి అంజయ్య, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అవురం సుధాకర్ రెడ్డి జిల్లా,రాష్ట్ర నాయకులు డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బూరసదానందం, దొంతుల శ్రీహరి, మైలా రం తిరుపతి, సురేష్, పర్షరాములు,శ్రీనివా స్, రాజేందర్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.






