21 May, 2026 | 4:20 AM

ఉపాధి హామీ పనుల్లో కూలి మృతి

21-05-2026 12:35 AM

కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం

నాగిరెడ్డిపేట్,మే 20 (విజయ క్రాంతి):మండలంలోని జానకంపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గత సంవత్సరం గ్రామానికి చెందిన భూమని రాములు మృతి చెందారు.మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.2 లక్షల చెక్కును మండల కాంగ్రెస్ నాయకులు,అధికారులు మృతుని కుటుంబానికి అందజేశారు.బుధవారం మృతుడి భార్య భూమిని సాయమ్మకు ఆర్థిక సహాయ చెక్కును గ్రామ సర్పంచ్ వర్షిణి-పరమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఎంపీఓ ప్రభాకర్ చారిలు అందించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ...మృతుడి కుటుంబానికి పార్టీ మరియు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కుటుంబానికి పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి మరియు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఎంపీఓ ప్రభాకర్ చారి,కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య, ఫీల్ అసిస్టెంట్ రాములు, తదితరులు పాల్గొన్నారు.