దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోం: కేటీఆర్
- నెహ్రూ రికార్డును మోదీ తిరగరాస్తే... సామాన్యుడికి ఏం జరిగింది?
- తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాలు పెంచాలి
- జలిమి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి
- మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా?
- మోదీ 12 ఏళ్ల పాలన.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది శూన్యం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill) తెస్తుందన్న సమాచారం ఉందని కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాలు పెంచాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ జరిగితే చాలా మార్పులు వస్తాయి.. ఎవరెక్కడ పోటీ చేస్తారో చెప్పలేమని కేటీఆర్ వెల్లడించారు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలని కేటీఆర్ పేర్కొన్నారు.
డీలిమిటేషన్ లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదన్నారు. మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోమని హెచ్చరించారు. జవాహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) రికార్డును మోదీ తిరగరాస్తే.. సామాన్యునికి ఏం జరిగింది? అని ప్రశ్నించారు. మోదీ 12 ఏళ్లలో చేసిన మంచి పనులు ఏంటో చెప్తే అభినందిస్తామని చెప్పారు. మోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది శూన్యమని కేటీఆర్ పేర్కొన్నారు.






