7 April, 2026 | 3:22 PM

Breaking News

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •  

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్

29-09-2025 12:26 PM

హైదరాబాద్: సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma greetings) సందర్భంగా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఇది తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును సూచించే పండుగ అని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ భక్తి పండుగని,  పువ్వులు, ప్రకృతి గౌరమ్మను పూజిస్తారు. ''రంగురంగుల పువ్వులు... ఆడపడుచుల ఆటపాటలు... ప్రకృతిని ఆరాధించే వేడుకలు! తెలంగాణ సాంసృతిక వారసత్వం, అస్తిత్వ ప్రతీక బతుకమ్మ పండుగ సందర్భంగా... ప్రపంచ వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.'' అంటూ కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటికి శ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తూ, తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో ఆనందం, విజయం కోసం కేటీఆర్ ప్రార్థించారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు కూడా బతుకమ్మను తెలంగాణ ఆత్మ, గర్వంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగను జీవిత గీతంగా, మహిళల ఆత్మగౌరవ వేడుకగా అభివర్ణిస్తూ, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.