7 April, 2026 | 5:04 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

29-09-2025 12:16 PM

హైదరాబాద్: సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా ఆడబిడ్డలకు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Ra) శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మను తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయంగా కేసీఆర్ అభివర్ణించారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ సాంస్కృతిక సంప్రదాయం, తెలంగాణకు ప్రత్యేకమని కేసీఆర్(KCR) తెలిపారు. ప్రకృతిమాత బతుకమ్మ ప్రతి ఇంటినీ ఆశీర్వదించాలని, కష్టాలను తగ్గించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు ఆనందం, శ్రేయస్సును అందించాలని కేసీఆర్ ప్రార్థించారు.