9 June, 2026 | 4:03 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం   •   పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం వనికిన జనం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •  

చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం

09-06-2026 12:00 AM

కొత్తపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1 నుండి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన కేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భా గంగా సోమవారం రోజున చింతకుంటలో నార్మ్ శాస్త్రవేత్తలు, హైద్రాబాద్ మరియు కెవికె జమ్మికుంట శాస్త్రవేత్తలు  కొత్తపల్లి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరి గింది.

ఇందులో భాగంగా కెవికె జమ్మికుంట ప్రధాన శాస్త్రవేత్త ఎన్ వెంకటేశ్వర్లు గ మాట్లాడుతూ అధిక యూరియా వాడడం వలన కలిగే నష్టాలను గురించి వివరిస్తూ ,  పంట అవశేషాలు కాల్చవద్దని, బదులుగా వేస్ట్ డీకంపోజర్ వాడి పంట అవశేషాలు కలియ దున్ని సేంద్రియ కర్బనాన్ని పెంపొందించి  నేలను సంరక్షించుకోవాలి కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించే ఎనిమిది సన్నపు వరి వంగడాలను పండించే యాజమాన్యాలు చర్యలను చేపట్టే జాగ్రత్తలను సూచించారు.

ముఖ్యంగా తెలంగాణ సోనా అంటే ఆర్ ఎన్ ర్ 15048 వంగడాన్ని వేయదలచిన రైతులు జూలై 15 తర్వాతే నారు పోసుకోవాలి అని, మోతాదుకు 30 శాతం తగ్గించి యూరియా వాడాలని సూచించారు.తదుపరి తర్వాత నార్మ, హైద్రాబాద్ ప్రధాన శాస్త్రవేత్తలు డా.ఎన్.శ్రీనివాస్ రావు, డా.యామిని, డా. రేష్మ  మట్లాడుతూ  పోర్టబుల్ సాయిల్ టెస్టింగ్ కిట్ ద్వారా మట్టి పరీక్షలు రైతులు తమ పొలం వద్దనే ఏరకంగా చేసుకోవాలో చూపించారు.

తర్వాత పది మంది  రైతులకు  వరి మినీ కిట్స్ డిఆర్‌ఆర్ 60 అనే రకాన్నిఅందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి కోట సంతోష్ కుమార్, ఎఈఓ ఫజిల్, ఎఫ్ పిఓ ఛైర్మెన్,సభ్యులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.