భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి
ఖమ్మం రూరల్, జూన్ 22(విజయక్రాంతి): యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఏసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అప్ర మత్తం చేయాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పప రిణామాలపై విద్యార్థులు, ప్రజలకు కూడా విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సంజీవ్, ఎస్త్స్ర జగదీశ్ పాల్గొన్నారు.






