calender_icon.png 18 February, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 08:21:11 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ,తుమ్మలతండా బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 72వ జన్మదిన సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆటపాటలతో కేక్ కట్ చేసి కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్, కృష్ణంరాజు  మాట్లాడుతూ కేసిఆర్ ఉద్యమ నేతగా పోరాటం చేసి ప్రాణాలకు ఎదురోడ్డి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,నాలుగు కోట్ల ప్రజల కలల్ని సాకారం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,పలు గ్రామాల సర్పంచ్లు,ఉప సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు,మహిళ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.