10 May, 2026 | 12:37 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయం

17-02-2026 08:12 PM

ఘనంగా  కేసీఆర్ జన్మదిన వేడుకలు

అలంపూర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కెసిఆర్ పాత్ర చిరస్మరణీయమని బీఆర్ఎస్ నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ కరుణ సూరి అన్నారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని శాంతినగర్ పట్టణంలో వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 

అయిజలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు 

అయిజ పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనలో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువయ్యా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాల నరసింహులు, నాగర్ దొడ్డి వెంకటరాములు, కురువపల్లయ్య, మల్లికార్జున రెడ్డి మాస్టర్ మధు, తిరుమలేష్, రజాక్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు