10 May, 2026 | 1:53 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

ప్రభుత్వ భూములను పరిరక్షించడమే ధ్యేయం

17-02-2026 08:08 PM

కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ భూముల పరిరక్షనే ధ్యేయంగా పనిచేస్తున్నామని కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ సర్వేనెంబర్ 417, 497లలో అక్రమంగా వెలసిన కట్టడాలను తాసిల్దార్ రాజేష్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం కూల్చివేతలు చేపట్టారు.

ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఊరుకునేది లేదని కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.