27 April, 2026 | 4:22 PM

తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. భారీగా బౌన్సర్ల మోహరింపు

27-04-2026 02:40 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం(BRS Party 26th Formation Day) సందర్భంగా మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో ప్రారంభం కానున్న రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయన్నారు. తెలంగాణ భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా బౌన్సర్లు మోహరించారు. కార్యకర్తలు లోపలికి చొచ్చుకొని వెళ్లకుండా నేతలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి.