21 July, 2026 | 7:15 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

వైభవంగా కట్టమైసమ్మ బోనాల జాతర

20-07-2026 12:00 AM

మూకారంపుర, జూలై 19 (విజయ క్రాంతి): కట్టరాంపూర్లోని లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎల్ ఎండీ జలవిహార్ స్విమ్మ ర్సు అసోసియేషన్ ఆధ్వర్యంలో కట్టమైసమ్మ బోనాల జాతర ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఎల్లమ్మ ఆలయం నుంచి శివసత్తుల పూనకాలతో, డప్పు చప్పుళ్ల నడుమ భ క్తులు భారీ ర్యాలీగా కట్టమైసమ్మ ఆలయానికి చేరుకుని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న బోనం ఎత్తుకొని జలవిహార్ స్వి మ్మర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ నర్మదా నర్సన్న తో పాటు జలవిహార్ సిమ్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాశం రాజిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కలర్ సత్తన్న, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, జనరల్ సెక్రెటరీ గంగ తిరుపతి పటేల్, తదితరులు పాల్గొన్నారు.