13 June, 2026 | 9:52 PM

Breaking News

ఏజెన్సీలో ఈదురు గాలుల వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు.   •   ​ఖబర్దార్ నాగేందర్.. తేల్చుకుందాం రా   •   కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసుల నోటీసులు   •   నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం   •   ‘మన ఊరు–మన అంగన్వాడి’ నినాదంతో బడిబాట కార్యక్రమం   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం   •   భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •  

కబడ్డీ క్రీడాకారిణి డి.అనుకు సన్మానం

06-11-2025 04:33 PM

నంగునూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గట్లమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.అనును గురువారం గ్రామ యువకులు ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో ప్రోత్సాహం అందించిన పిఈటీ, ఉపాధ్యాయ బృందానికి ఈ సందర్భంగా అను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. రానున్న పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల విద్యార్థులకు వరుసగా ఐదు, మూడు, రెండు తులాల వెండిని బహుకరిస్తామని యువకులు తెలిపారు. క్రీడారంగంతో పాటు విద్యారంగంలోనూ గ్రామ యువకులు పెద్దల సహకారంతో పాఠశాలను మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు చింటూ, యువకులు మహేందర్, కర్రీ సంపత్, రంగు టింకు పాల్గొన్నారు.