కేవలం క్రమశిక్షణే: మల్లు రవి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : కొండా సురేఖ, చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించడం కేవలం క్రమశిక్షణలో భాగమేనని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ (Congress Disciplinary Committee) అధ్యక్షులు మల్లు రవి పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.
ఇద్దరి విషయంలో అన్ని అంశాలను పరిశీలించాకే పార్టీ పెద్దలకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. మహిళను పదవి నుండి తొలగించారని వేరే పార్టీల వాళ్లు మాట్లాడతారని, దాన్ని దృష్టిలో పెట్టుకునే మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చారన్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా పద్మశాలికి చెందిన గుండు సుధారాణికి అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.






