కాంగ్రెస్ పార్టీలో చేరికలు
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని జువ్వాడి గ్రామానికి చెందిన సర్పంచ్ శాంతవ్వ మల్లయ్య, ఉప సర్పంచ్ సంతోష్, వార్డు సభ్యులు సాయిమల్లు, అర్చన శ్రీనివాస్ లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో( Congress Party) చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శాంతవ్వ మల్లయ్య మాట్లాడుతూ నియోజక వర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ చేస్తున్న అభివృద్ధి , గ్రామాల అభివృద్ధి కొరకు, పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఆయన చూపుతున్న చొరవ తమకు నచ్చి పార్టీలో చేరినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు వినయ్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంతోష్, ఎన్.ఎస్.యు.ఐ. అధ్యక్షులు మోహన్, గ్రామ అధ్యక్షుడు భూమేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు..




