18 April, 2026 | 1:01 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

29-11-2025 10:05 PM

రాజాపూర్: మండలంలోని కుచ్చర్ కల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు మనోహర్ రెడ్డి, ఆయన కుమారుడు సుజయ్ చంద్రారెడ్డి శనివారం జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి జనంపల్లి శశికళ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి దుశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుజాయ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కుచ్చర్ కల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సుజయ్ చంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, సత్యం వెంకటయ్య మల్లేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు యువకులు పాల్గొన్నారు.