15 July, 2026 | 6:17 PM

Breaking News

వాసవి వరల్డ్ విద్యార్థి ప్రతిభ   •   తాడిచర్ల–2 బ్లాక్ విజయోత్సవంలో సింగరేణి డైరెక్టర్ పి&పి కె.వెంకటేశ్వర్లు   •   ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమస్యలు చెప్పండి   •   మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ   •   నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   తెయూకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు   •  

గులాబీ గూటికి జిన్నారం మున్సిపల్ స్వతంత్ర అభ్యర్థి

16-02-2026 12:40 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ సమక్షంలో చేరిక

పటాన్చెరు, ఫిబ్రవరి 15: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులు సైతం గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన శిల్పా నాగరాజు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుల సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వతంత్ర అభ్యర్థులు సైతం బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బిఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని తెలిపారు. ఇందుకు సంపూర్ణ సహకారం అందించిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు.. పూర్తి విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్, కృష్ణ, గోవింద్, మచ్చేందర్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.