1 July, 2026 | 7:09 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

జగన్.. ఇప్పటికైనా చెల్లికి న్యాయం చేయి

21-03-2026 12:00 AM
  1. ఆస్తుల విషయంలో చెల్లెకు, ఆమె పిల్లలకు జగన్ అన్యాయం
  2. నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్‌ఆర్ ఉద్దేశం
  3. దగ్గరి వాళ్లందరికీ ఈ విషయం తెలుసు
  4. జగన్ తల్లి విజయమ్మ 
  5. మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : ఆస్తుల విషయంలో చెల్లె షర్మిలకు, ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశాడని, ఇప్పటికైనా చెల్లికి న్యాయం చేయాలని తల్లి విజయమ్మ పేర్కొన్నారు. ఉన్న ఆస్తిని నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్‌ఆర్ ఉద్దేశమని, దగ్గర వా ళ్లందరికీ తెలిసిన వాస్తవమిదని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం మీడియాకు జగన్ తల్లి విజయమ్మ విడుదల చేసిన అడ్వకేట్ నోటరీలో జగన్..

షర్మిలకు ఆస్తుల పంపకంలో అన్యాయం చేశాడని ఆరోపణలు చేశారు. షర్మిల కొడుకు, కూతుళ్లున జగన్ మేనల్లుడు, మేనకోడలికి అన్యాయమే చేశాడన్నారు. అ సలు పంపకమే జరగలేదని ఆమె నోటరీలో పేర్కొనడం విశేషం. వైఎస్‌ఆర్ మరణించే ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులుగానే ఉన్నాయని చెప్పారు. అయితే తాను సంపాదించిన ఆస్తులన్నీ జగన్, షర్మిల పిల్లలైన.. తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పం చాలని వైఎస్‌ఆర్ ఉద్దేశమని నోటరీలో విజయమ్మ పేర్కొన్నారు.

ఈ విషయం తమ కుటుంబానికి దగ్గరి వాళ్లందరికీ తెలుసని వెల్లడించారు. అయితే ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందేనని, షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ కూడా ఎంవోయూ రాశాడ ని పేర్కొన్నారు. కానీ ఉన్న ఆస్తిలో షర్మిల వాటాకంటే తక్కువే రాశాడని ఆరోపించారు. సరస్వతి సిమెంట్, యెలహంక భూమి షర్మిలదేనని చెప్పారు. అయితే షర్మిలకు జగన్ ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉన్న డబ్బంతా డివిడెండ్ మాత్రమేనని చెప్పారు.

ఆస్తుల విషయంలో నిజం ఏమిటో దేవుడికి, జగన్‌కే తెలుసునని, తాను నోటరీలో రాసినవన్నీ దే వుడి సాక్షిగా వాస్తవాలు మాత్రమేనని పేర్కొన్నారు. జగన్ తన చెల్లికి ఇప్పటికైనా న్యా యం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని నోటరీలో పేర్కొన్నారు. కాగా వైఎస్‌ఆర్ కుటుంబ ఆస్తుల పంపకాలపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎలీ)లో వివాదం కొనసాగుతున్నది. ఇలాంటి సమయంలో వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మ మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.