1 June, 2026 | 4:16 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ డిమాండ్

01-06-2026 12:00 AM

గద్వాల టౌన్, మే 31: గద్వాల ఆర్టీసీ డిపోలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ గేట్ మీటింగ్ నిర్వహించారు.సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన విలీన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ముందుగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి తర్వాత విలీనం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.జూన్ 2న ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. జేఏసీ నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.