29 May, 2026 | 3:18 AM

వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే

29-05-2026 12:00 AM
  1. రాష్ట్రంలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే
  2. దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ 
  3. ఓట్ల రాజకీయం కోసమే ‘సర్’పై దుష్ప్రచారం
  4. ప్రశిక్షణా తరగతుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి) : తెలంగాణలో రాబోయేది బీజేపీ డబుల్ ఇం జన్ సర్కారే అని, దాని కోసం కార్యకర్తలం తా కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. మోయినాబాద్‌లో గురువారం నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియా న్ రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రశిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ సిద్ధా ంతంలో, మేనిఫెస్టోలో భాగమైన ఆర్టికల్ 370 రద్దును ఏ విధంగా సాధించామో, అదే విధంగా దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) కూడా అంతే అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, గో వా, అస్సాం రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీసుకొచ్చాయన్నారు.

యూసీసీ ఏదో ఒక మతానికి వ్యతిరేకం కాదని, దీనివల్ల దేశంలోని మహిళలకు, చిన్న పిల్లలకు చట్టబ ద్ధమైన ఆస్తి హక్కులు, అడాప్షన్ హక్కులు లభిస్తాయన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును బీజేపీ స్వాగతిస్తోందన్నారు. దొంగ ఓటర్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న్డారు.

గత బీఆర్‌ఎస్ నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందనిన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అనేక చోట్ల కొనుగోలు కేం ద్రాల్లోని రైతుల ధాన్యం, మక్కలు, జొన్నలు తడిసి ముద్దయ్యాయని, కొనే నాథుడు లేక రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు. బీజేపీ చేపట్టిన ’రైతు గోస భరోసా’ యాత్ర నిర్మల్ (సారంగ పూర్)తో ముగిసినా.. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదని హెచ్చరించారు.

తెలంగాణకు కేంద్రం గత 12 ఏళ్లలో సుమారు రూ. 13 లక్షల కో ట్లు కేటాయించిందని.. ప్రతినెలా 5 కిలోల ఉచిత బియ్యం, జాతీయ రహదారులు, ము లుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, బీబీనగర్ ఎయిమ్స్, వరంగల్- ఎయిర్‌పోర్టులు, రామగుం డం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, జన్ ధన్ ఖాతాలు ఇవన్నీ మోదీ వల్లే సాధ్యమయ్యాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పట్ల విసిగిపోయిన యువత, మహిళలు, ఐటీ ఉద్యోగులు, విద్యావంతులు ఒక కొత్త రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, ఆ నమ్మకమే బీజేపీ అని తెలిపారు.