30 May, 2026 | 4:50 AM

అంతా ఆధ్యాత్మిక చింతనే

30-05-2026 12:48 AM
  1. కాళేశ్వరంలో వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు
  2. భారీగా తరలివచ్చిన భక్తులు
  3. విశాఖ పిఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ పుష్కర స్నానం 

మహబూబాబాద్/కాళేశ్వరం, మే 29 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లో సరస్వతీ అంత్య పుష్కరాలు భక్తి భావం, ఆధ్యాత్మిక చైతన్యాలతో కనులపండువగా కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజు శుక్రవారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు పవిత్ర పుష్కర ఘాట్ల లో పుణ్యస్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామి, శుభానందదేవి, జ్ఞాన సరస్వతీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నా రు.

పుష్కర స్నానాల తో పాపక్షయం కలుగుతుందనే విశ్వాసం తో భక్తులు కుటుం బ సమేతంగా తరలివచ్చి తీర్థస్నానాలు ఆచరించా రు. ఘాట్ల పరిసరాలు భక్తుల తో కళకళలాడగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో క్షేత్రం సందడిగా మారింది.  భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పా ట్లు చేపట్టారు. తాగునీరు, వైద్య శిబిరాలు, భద్ర తా ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలను సమర్థవంతం గా అమలు చే స్తున్నారు.

సాయంత్ర వేళ ల్లో హారతుల కాంతులతో పుష్క ర ఘాట్లు మరింత దివ్యరూపాన్ని సంతరించుకుంటుండగా, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేస్తున్నాయి. విశా ఖ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ శుక్రవారం అంతర్వాహినిలో సరస్వతి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని, దర్శించి అభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వా మిజి మాట్లాడుతూ.. పూర్వకాలంలో గంగా స్నానం చేసిన మరల గోదావరి స్నానం చే యాలని  వేదాలు చెప్పే వని పుష్కరాల కా లంలో గోదావరి ప్రాణహిత అంతర్యామి సరస్వతి నది త్రివేణి సంగమంతో ఈ అంత్య పుష్కరాలు చాలా గొప్పవని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీ ఎం రేవంత్ రెడ్డి చాలా గొప్పగా వేడుకలు చేయాలని నిర్ణయించడం సంతోషమన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు  ఇంత అత్యద్భుతంగా కాశీ లో హారతులు ఇచ్చే గొప్ప పండితులను రప్పించడం  గొప్పగా అలంకరణ చేయడం ఇక్కడ భక్తులు ధన్యాత్ములని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం దేవాల యాన్ని  వేములవాడ వలే అభివృద్ధి చేయాలని, బాసర దేవాలయంలాగా చేయాలని సంకల్పించడం ప్రభుత్వం యొక్క గొప్పతనమని కొనియాడారు.

దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హను మంతరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరికి, చక్కటి ఏర్పా ట్లు చేసిన  జిల్లా యంత్రాంగం కృషి గొప్ప ఫలితం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మ న్ శాంతి కుమారి సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని స్వామికి అభిషేకం నిర్వహించారు.