సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి
సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నా రు. ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్ర స్తుతం సెట్స్‌పై ఉంది. ఇలా ఓ సిని మా చిత్రీకరణ లో ఉండగానే బాలకృష్ణ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధి కారికంగా ప్రకటించారు. ఇంకా టై టిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్టును ప్రస్తుతం ‘ఎన్‌బీకే 112’ అనే పేరుతో పిలుస్తున్నారు. అయితే, ఈ సినిమా ను దర్శకుడు కొరటాల దర్శక త్వం వహిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది. లార్జర్ దెన్ లైఫ్ మాస్ ఎంటర్‌టైనర్లను రూపొందించడంలో సిద్ధహ స్తులైన ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించి బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్సుకు సరిపోయేలా ఒక బలమైన కథను సిద్ధం చేశారు దర్శకుడు కొరటాల శివ. తాజాగా విడుదల చేసి అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కనిపించిన ‘శక్తి లక్ష్యాన్ని కలుస్తుంది, సమూహం ఒక ఉద్యమంగా మారు తుంది’ అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్‌లో ఉన్న ట్యాగ్‌లైన్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా ఎంత శక్తిమంతంగా ఉండబోతోందో అర్థమవుతోంది. డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్టును లాక్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్ర ని ర్మాత, నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.






