calender_icon.png 7 February, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం

07-02-2026 11:26:16 AM

అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 

ఈ నెల 9 నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి

భద్రాద్రి కొత్తగూడెం: సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. 

జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారి నకు సమర్పించాలన్నారు.  యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌ సైట్http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలలో ఆన్‌ లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 9 నుండి సమర్పించాలని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్  ప్రకటనలో పేర్కొన్నారు.