ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
దేవరకొండ,విజయక్రాంతి: గురువారం దేవరకొండ పట్టణంలోని మునగల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా డబ్ల్యూ ఈ సి (ఉమెన్స్ ఎంపవర్మెంట్ సెల్) విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ„ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ స్త్రీ లేకపోతే మనుగడ అత్యంత క్లిష్టంగా ఉంటుందని స్త్రీలను గౌరవించి పూజించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుకుడాల ఉమామహేశ్వరి (ఫౌండర్ ఆఫ్ గ్రీన్ మ్యారో జూట్ క్రియేషన్స్ ) మాట్లాడుతూ స్త్రీలు,ఇంట్లో సమాజంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటారని వాటన్నిటిని అధిరోహిస్తూ, వంటింటికి పరిమితం కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలోని మహిళా సిబ్బంది అందరిని గౌరవంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.కోటయ్య అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య,డా„కె.పృథు, డా„కె.రేణుక, డా„ఎం. ప్రభాకర్, డా„వి. మకట్ లాల్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




