25 March, 2026 | 2:12 AM

కానిస్టేబుల్ కుటుంబానికి బీమా

25-03-2026 12:00 AM

రూ.1.05 కోట్ల చెక్కును అందజేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ పోలీస్ శాఖ లో ప్రత్యేక జీతాల ప్యాకేజీ ఒప్పందం ప్రకా రం, ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు బీమా కవరేజీని అందిస్తుంది. గత సంవత్సరం ఏఆర్ కానిస్టేబుల్‌కు బి రామానాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన తెలంగాణ సౌత్ రీజియన్, బ్యాంక్ ఆఫ్ బరోడా నార్కెట్‌పల్లి బ్యాంచులో బరోడా పోలీస్ జీతాల ప్యాకేజీని నిర్వహిస్తున్నాడు.

అతని బీమా క్లెయిమ్ వెంటనే ప్రాసెస్ చేయబడింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి రూ.1.05 కోట్ల బీమా చెక్కును రామానాయుడు సోదరుడు బోయ బీచుపల్లికి డిజిపి కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఐజీ వెల్ఫేర్ డాక్టర్ గజరావు భూపాల్, జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ రితేష్ కుమార్, తెలంగాణ సౌత్ రీజియన్ డీజీఎం, రీజనల్ హెడ్ రవి హెచ్ జీ, డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ బ్రిగేడియర్ సనియ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు.