14 March, 2026 | 1:04 AM

విద్యుత్ దీపాలకు విద్యుత్ బల్బులు ఏర్పాటు

13-03-2026 10:34 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రానున్న ఉగాది పండగ పురస్కరించుకొని మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో విద్యుత్ స్తంభాలకు,విద్యుత్ బల్బులకు నాగిరెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్ భారత్ గ్యాస్ ప్రోప్రైటర్ విట్టల్ రెడ్డి 30 వేలతో పెట్టించడం జరిగింది. గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు విట్టల్ రెడ్డిని శాలువాతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ మాట్లాడుతూ... గ్రామంలో విద్యుత్ బల్బులు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు కృషి చేసిన విట్టల్ రెడ్డికి గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాలాజీ, గ్రామ పెద్దలు బొల్లు నరసింహా రెడ్డి, కిషన్ రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకట్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మురళి గౌడ్, గోపాల్పేట్ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్,నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.