5 June, 2026 | 2:34 AM

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

05-06-2026 01:27 AM

జనగామ, జూన్ 4 (విజయక్రాంతి): జనగామ జిల్లా నర్మేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువా రం జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొ దటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పు రోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నర్మేట గ్రామ సర్పంచ్ శ్రీధ ర్ తో కలిసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ స్థితిగతులను తెలుసుకున్నారు.

పనులను వేగవం తంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడం ప్రభు త్వ లక్ష్యమని, లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.