15 July, 2026 | 12:52 PM

Breaking News

ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •   రూపాయి విలువ పెరిగింది.. 553 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు   •   ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు   •  

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

20-12-2025 01:11 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన కుటుంబాలు తప్పకుండా పనులు ప్రారంభించాలని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ మంజూరైన కుటుంబాలు కంపల్సరిగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. తాండూరు గ్రామంలో సుమారు 26 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు దాదాపు అందరూ పనులు కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శిలు తిరుపతి కిష్టయ్య ఉన్నారు.