20 August, 2026 | 5:43 PM

రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం: వెంకటేష్ యాదవ్

20-08-2026 04:58 PM

మల్కాజిగిరి,(విజయక్రాంతి): దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీ యమని కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మౌలాలి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భారత దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసి సాంకేతిక విద్యను అందజేసిన దూరదృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు.

యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి కొత్త శక్తి ఇచ్చిన నాయకుడిగా రాజీవ్ గాంధీ ఎప్పటికీ అందరికీ గుర్తుండి పోతా రన్నారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను తీసుకొచ్చిన గొప్ప నాయ కుడు రాజీవ్ అని కొని యాడారు. ఈ కార్యక్రమం లో  వర్కింగ్ ప్రెసిడెంట్ బీకే శ్రీనివాస్, మౌలాలి 186 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, నాయకు లు  వెంకటేష్, అమీర్ భాయ్, ఫారుక్, భాస్కర్, చంద్ర కాంత్, ముక్తార్, షకీల్, నరసింహ, ప్రేమ్, యాకూబ్, నర్సింగ్ రావు, భీమ్ రాజ్,కృష్ణ, సుభాయ్, దైవసాయం, మహిళా నాయకురాలు మహిమ దా, డివిజన్ ప్రెసిడెంట్ సంపత్ గౌడ్, ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాని, అభిలాష్, దినేష్, హరీష్, భరత్ తదితరులు పాల్గొన్నారు