4 April, 2026 | 2:20 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

ఇందిరమ్మ ఇండ్లు పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక

04-04-2026 12:47 AM

ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

అడ్డాకుల, ఏప్రిల్ 3 : ఇందిరమ్మ ఇండ్లు పేదోడి ఆత్మగౌరానికి ప్రతీక అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.  అడ్డాకుల మండల పరిధిలోని పొన్నకల్, రాచాల, రెండు గ్రామాలలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు సొంత ఇల్లు ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు

. అదేవిధంగా లబ్ధి పొందిన లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంరేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డికి, డిప్యూటీ సీఎం, బట్టి విక్రమార్కకి, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.