ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకు వరం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి, ఏప్రిల్ 30 : ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు వరం లాంటిదని, పేద ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. జిల్లాలోని నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలో షేక్ రహీనా బేగం - దావీద్ నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అకుటుంబ సభ్యులకు 5000రూపాయలు అందజేసి పట్టు వస్త్రాలు పెట్టి వారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి మొదటి విడుదల మంజూరైన ఇండ్లను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిర్మించుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి అదనంగా 2000 మంజూరు కి ముఖ్యమంత్రితో మాట్లాడి, మంజూరు చేయుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సుమతి మండలం వెలుగు పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవాలయానికి, ఒక లక్ష రూపాయలు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ఆధ్వర్యంలో విరాళంగా అంద చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుడుసు లింగయ్య యాదవ్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాడు సైదులు, సర్పంచ్ అశ్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






