20 May, 2026 | 4:50 AM

ఇసుక అక్రమ త్రవ్వకాలు నిర్మూలించాలి

20-05-2026 12:32 AM

కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్, మే 19 (విజయక్రాంతి) : జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు పూర్తి స్థాయిలో నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక రీచ్ లను గుర్తించాలన్నారు. అక్రమ ఇసుక త్రవ్వకాలని పూర్తిస్థాయిలో నివారిస్తామని చెప్పారు.

కేవలం మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలు పారదర్శకంగా జరగాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చూడాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టినా, రవాణా చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, భూగర్భ జల అధికారి శ్రీనివాస బాబు, డిపిఓ శ్రీనివాస్, రాయల్టీ ఇన్స్పెక్టర్ ఆనంద్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.