అక్రమ నిర్మాణాలు ఆపాలి
30-03-2026 03:28 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎల్లెపల్లి శివారు కొందరు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, వెంటనే ఆపాలని మాజీ కౌన్సిలర్ నల్లూరి పోశెట్టి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రాధారుని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 465లో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను చేపడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి కట్టడాలను ఆపాలని భూమి పై సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ జెసికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.




