25 April, 2026 | 6:11 AM

ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వానికి సకల జనుల సెగ తప్పదు

25-04-2026 12:56 AM

మధిర, ఏప్రిల్ 2౪ (విజయ క్రాంతి): ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, పలు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఆర్టీసీ కార్మికులు సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సకల జనుల సెగ తప్పదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దొండపాటి రమేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవికుమార్ యగంళ ఆనందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గురువారం మధిర ఆర్టీసీ డిపో వద్ద జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చూపిద్దని రెండు సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న పరిష్కారం చూపుకోవటంతో కార్మికులు ఆందోళన బాటకు దారి తీసింది వారు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సకల ఉద్యోగులు మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతారని వారు ప్రభుత్వానికి గుర్తు చేశారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.