10 April, 2026 | 2:12 AM

గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తా

10-04-2026 12:35 AM

నిజామాబాద్ ఎంపీ అరవింద్

కోరుట్ల రూరల్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ చేయూతనిస్తానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు గా ఎంపీ ల్యాడ్స్  నిధుల మంజూరీకి నిరంతరం కృషి చేస్తానని అరవింద్ అన్నారు. గురువారం కోరుట్ల మండలంలోని జోగినపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం  కింద రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా  నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తో కలిసి ఎంపీ అరవింద్  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ జోగినపల్లి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి తన వం తు నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ ఎల్పుల అంబేద్కర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు పంచిరి విజయ్, నాయకులు అంబల్ల సుదర్శన్, తోట లింగారెడ్డి, ద్యావనపెళ్ళి శరత్, గిన్నెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.